: పాల్వంచ పెద్దమ్మకు పూజలు చేసిన కేసీఆర్ సతీమణి శోభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనం పలికారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిన్న సాయంత్రం ఆమె భద్రాచలం వచ్చారు. ఈ ఉదయం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని, ఆ తర్వాత తిరుగుపయనంలో పాల్వంచ చేరుకుని, అమ్మవారిని దర్శించుకున్నారు.