: రద్దయిన నోట్ల డేటా మిస్... బయటకు చెప్పరేంటని విపక్షాల సూటి ప్రశ్న


నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8 తరువాత డిసెంబర్ 30 వరకూ ఎంత కరెన్సీ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది? ఈ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం రాలేదు. అటు ఆర్ బీఐగానీ, ఇటు కేంద్రంగానీ, ఎంత మొత్తం డిపాజిట్ అయిందన్న విషయం వెల్లడించలేదు. వాస్తవానికి ఏ రోజు డిపాజిట్ అయిన పాత నోట్లను ఆ రోజే ఆర్బీఐ చెస్ట్ లకు పంపిన బ్యాంకులు, ఆ వివరాలను రిజర్వ్ బ్యాంకుకు ఎప్పటికప్పుడు వెల్లడించాయి. వాటిని క్రోడీకరించిన ఆర్బీఐ ఒకటి రెండు సార్లు డిపాజిట్ మొత్తం ఎంతన్న విషయాన్ని వెల్లడించింది కూడా. చివరి గణాంకాలు మాత్రం బయటకు రాలేదు.
ఇక ఇదే విషయమై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నోట్ల రద్దు డేటా ఆర్బీఐ నుంచి మిస్ అయిందన్నది విపక్షాల ఆరోపణ. దేశంలోని పెద్ద నోట్లు రూ. 15.44 లక్షల కోట్లని ప్రభుత్వం ప్రకటించగా, అంతకు మించిన ధనం డిపాజిట్ అయిందని అందువల్లే గణాంకాలను బయట పెట్టడం లేదని ఎంపీ శరద్ యాదవ్ ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఓ తరం భవిష్యత్తును నాశనం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు మోదీ సహకరించారని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News