: డ్రైవర్ కు ఫిట్స్... బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ నుంచి వీణవంక మండలం వైపు బస్సు వెళుతున్న సమయంలో, శంకర్ పట్నం మండలం తాడికల్ వద్ద డ్రైవర్ కొండయ్యకు ఫిట్స్ వచ్చాయి. దీంతో, బస్సు చెట్టును ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అనే ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ కొండయ్య పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మండి ప్రయాణికులు గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆసుప్రతికి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు.