raser: కొత్త ఆవిష్కరణ: ఈ ల్యాప్‌టాప్‌కి మూడు స్క్రీన్లు ఉంటాయి!
ఇంతవరకు మనం సింగిల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌లను మాత్రమే వాడాం. డబుల్, త్రిబుల్ స్క్రీన్ లాప్‌టాప్‌లు వస్తాయని మన ఊహకు కూడా అందలేదు. అయితే, అమెరికాలోని ప్రముఖ గేమింగ్ అప్లికేషన్ సంస్థ రేజర్ మాత్రం అందరికన్నా భిన్నంగా ఆలోచించింది. ప్రపంచంలో ట్రిపుల్ డిస్‌ప్లే కలిగిన మొట్టమొదటి ల్యాపీని రూపొందించి అందరి దృష్టిని తమవైపుకి తిప్పుకుంది. మూడు స్క్రీన్లు ఉన్నప్పటికీ ఈ ల్యాప్‌టాప్‌కు ఒక్కటే కీబోర్డు ఉంటుంది. మూడు డిస్‌ప్లేలు 17.3 అంగుళాల వెడల్పుతో ఉంటాయి. ఈ మూడు స్క్రీన్లు ఒకదాని వెనక మరొకటి కలిసి ఉండి, యూజర్లు బటన్ నొక్కితే రెండు చెరోవైపు పక్కకు స్లైడ్ అయి పొడవాటి స్క్రీన్‌గా ఏర్పడతాయి. ఈ ల్యాప్‌టాప్‌ను ప్రత్యేకంగా గేమ్స్ కోసం రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్ 5.5 కిలోల బరువు ఉంటుంది. ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన సీఈఎస్ ట్రేడ్ షోలో దీనిని ప్రదర్శించారు.