: నౌకాదళ మాజీ ఉద్యోగి ఘాతుకం... తండ్రిని చంపి, తల్లిని చంపేందుకు సిలిండర్ పేల్చాడు!


తూర్పు ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు కన్న తండ్రిని కత్తితో దారుణంగా హత్య చేసిన నావికాదళ మాజీ ఉద్యోగి, తల్లిని చంపేందుకు గ్యాస్ సిలిండర్ పేల్చి కలకలం రేపాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, రాహుల్ మాతా అనే వ్యక్తి గతంలో నావికాదళంలో సెయిలర్ గా పనిచేశాడు. ఫైనాన్షియల్ సెక్టారులో పని చేసి మధు విహార్ లోని స్వగృహంలో విశ్రాంత జీవితం గడుపుతున్న అతని తండ్రి ఆర్పీ మాతాపై నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దాడి చేసి హత్య చేశాడు. తన భర్తను కాపాడుకునేందుకు వచ్చిన తల్లిని కూడా లెక్కలేయలేదు. ఇంట్లో వినిపిస్తున్న అరుపులకు స్పందించి సెక్యూరిటీ గార్డులు, ఇరుగు పొరుగు వారు రాగా, తలుపులు బిడాయించుకుని తల్లిని బంధించి గ్యాస్ సిలిండర్ పేల్చాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి తీవ్ర గాయాలతో పడివున్న నిందితుడి తల్లిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇటీవలే తన కుమారుడు తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఆర్పీ మాతా పత్రికలకు ఎక్కినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో శరీరానికి గాయాలు అవుతున్నా లెక్క చేయకుండా నిందితుడిని అదుపు చేసేందుకు యత్నించి సఫలమైన పోలీసులపై డిప్యూటీ కమిషనర్ ఓంవీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News