: ఎలుగుబంటికి విడాకులు ఇచ్చేస్తున్నారు... మ‌రో ఆడ ఎలుగుబంటితో జ‌త‌ కట్టనున్న మగ ఎలుగుబంటి!


డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ జూలో ఇవాన్‌, నియోల్‌ అనే మ‌గ‌, ఆడ ఎలుగుబంట్లు ప‌దేళ్ల నుంచి ఒకే బోనులో కలిసిమెలిసి ఉంటూ సంద‌ర్శ‌కుల‌ను అల‌రిస్తున్నాయి. వాటిని భార్యాభర్తలుగా పేర్కొంటూ అంద‌రూ వాటి అన్యోన్య దాంప‌త్యాన్ని చూసిపోతూ ఉంటారు. దీంతో ఈ ఎలుగుబంట్లు డెన్మార్క్‌లో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. అయితే, ఇన్నాళ్లూ  క‌లిసిమెల‌సి ఉన్న ఈ ఎలుగుబంట్లు ఇప్పుడు ఒక‌దాని ముఖం ఒక‌టి చూసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. ఈ ఎలుగుబంట్ల మ‌ధ్య మనస్పర్థలు ఎందుకు వ‌చ్చాయో ఎవ‌రికీ తెలియ‌దు కానీ, ఆడ ఎలుగుబంటి నియోల్ ఒక్కోసారి కోపం తెచ్చుకుని మానసిక ఆందోళనకు గురవుతుంద‌ట‌.

ఆ స‌మ‌యంలో అది నీళ్లలోకి దిగి ఈత కొడుతూ అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తుంది. ఈ విష‌యాన్ని జూ అధికారులు గ‌మ‌నించి ఇక ఈ ఎలుగుబంట్ల‌కు విడాకులు ఇద్దామ‌ని అనుకుంటున్నారు. మ‌గ ఎలుగుబంటి ఇవాన్‌ను జర్స్‌లాండ్‌లోని షాండినవియన్‌ వైల్డ్‌లైఫ్‌ పార్క్‌కి తీసుకెళ్లి అక్క‌డ‌ నునొ అనే మరో ఆడ ధ్రువపు ఎలుగుబంటితో జత క‌ల‌పాల‌ని చూస్తున్నారు. మ‌నుషుల తీరులాగే ఉన్న ఈ ఎలుగుబంట్ల సంసార సాగ‌రం ప‌ట్ల డెన్మార్క్ ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

  • Loading...

More Telugu News