: గజగజ వణుకుతున్న విశాఖ మన్యం
విశాఖ మన్యం ప్రాంత ప్రజలు గజగజ వణుకుతున్నారు. మన్యంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. నిన్న రాత్రి లంబసింగిలో 5.5 డిగ్రీలు, అరకు, మినుములూరుల్లో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యం ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటలైనా రోడ్డు సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది.