: సహజీవనం చేస్తున్న మహిళను 17 పోట్లు పొడిచాడు!
కాకినాడలోని ఎల్విన్ పేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న ధనలక్ష్మి అనే మహిళపై చంద్రశేఖర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా మొత్తం 17 పోట్లు పొడిచాడు. జరిగిన విషయాన్ని గ్రహించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు.