: గేదెలు, ఎడ్ల బండ్లను పంచుతున్న బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు


దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని పార్టీల నేతలు తమ యత్నాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, ఓటర్లకు గేదెలు, ఎడ్ల బండ్లు, దుప్పట్లను పంచి పెడుతున్న కుందర్కి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్ వీర్ సింగ్ పై నిన్న ఎఫ్ఐఆర్ నమోదయింది. రామ్ వీర్ ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని... ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఇది విరుద్ధమంటూ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి హజీ రిజ్వాన్ ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో, రామ్ వీర్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. అంతేకాదు, బీజేపీ నేత పంచిపెడుతున్న గేదెలు, ఎడ్ల బండ్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News