: జమ్ముకశ్మీర్ లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు... హై అలర్ట్
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. అఖ్కూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్ ఆర్మీ క్యాంపుపై దాడి చేశారు. భద్రతాబలగాలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడ పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖ్కూర్ సెక్టార్ లో హై అలర్ట్ ప్రకటించారు. బతాల్ గ్రామంలో తలదాచుకున్న ఉగ్రవాదులు... ఈ తెల్లవారుజామున ఆర్మీ క్యాంపుపై దాడికి తెగబడ్డారు.