: బ్యాంకుల హామీతో వెనక్కు తగ్గిన పెట్రోల్ బంకులు.. 'కార్డు'లు అనుమతిస్తామని ప్రకటన!


పెట్రోలు వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే, యజమానులకు వచ్చే కమీషన్ పై కొత్త పన్నులను విధించబోమని అటు బ్యాంకుల నుంచి, ఇటు కేంద్ర మంత్రి నుంచి హామీ రావడంతో పెట్రోల్ డీలర్ల సంఘాలు వెనక్కు తగ్గాయి. దీంతో ప్రస్తుతానికి అన్ని పెట్రోలు బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతిస్తామని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్ల సంఘం కార్యదర్శి రాజీవ్ వెల్లడించారు. కాగా, ఈ కొత్త పన్నులను నిరసిస్తూ, నేటి నుంచి కార్డులపై పెట్రోల్ పోయబోమని అంతకుముందు బంకు యజమానులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News