: చంద్రబాబు అందం వెనక కారణం ఇదే.. రహస్యాన్ని బయటపెట్టిన మంచు లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంత అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి గల రహస్యాన్ని మంచు లక్ష్మి బయటపెట్టారు. విజయవాడలో ఆదివారం ఉదయం జరిగిన మారథాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం వ్యాయామం చేస్తుండడం వల్లే ఆయన హ్యాండ్సమ్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. లైఫ్ స్టైల్‌లో వచ్చిన మార్పుల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామంతో అందంగా, ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.
అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మారథాన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి మారథాన్‌లు ఎంతో ఉపయోగపడతాయని మరోమంత్రి కామినేని అన్నారు. ఇటువంటి మారథాన్‌లు భవిష్యత్తులో మరిన్ని జరగాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ఏప్రిల్ నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. డీజీపీ నండూరి సాంబశివరావు, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా మాట్లాడారు. మారథాన్‌లో ఇథియోఫియా దేశానికి చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారులు కూడా పాల్గొనడం విశేషం. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.