: అన్నాడీఎంకేను చీల్చడం ఎవరి తరమూ కాదు.. కుట్రలను భగ్నం చేస్తాం.. తేల్చి చెప్పిన శశికళ
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అన్నాడీఎంకేను చీల్చడం ఎవరి తరమూ కాదని పార్టీ చీఫ్ శశికళ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు పట్టు సాధించేందుకు గతకొన్ని రోజులుగా జిల్లా కేడర్‌తో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్న శశికళ ఆదివారం పార్టీ కార్యాలయంలో తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకే అతిపెద్ద పార్టీ అని, దానిని చీల్చడం అసాధ్యమని తేల్చి చెప్పారు. పార్టీని చీల్చేందుకు జోరుగా కుట్రలు సాగుతున్నాయని, వాటిని భగ్నం చేసి తీరుతామని పేర్కొన్నారు. జిల్లాలోని నేతలందరూ కేడర్‌కు అందుబాటులో ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు, పుకార్లను ఎవరూ నమ్మవద్దని సూచించారు.