: స్కిప్పింగ్‌లో గత రికార్డులను చెరిపేసిన శునకం.. నిమిషానికి 58 జంప్‌లతో గిన్నిస్ రికార్డు
స్కిప్పింగ్‌లో గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ఓ శునకం తాజాగా తిరగ రాసింది. నిమిషానికి 58 జంప్‌లు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన మకొటో కుమగై తన పెంపుడు శునకం(11) ప్యూరిన్‌కు చిన్నప్పటి నుంచి స్కిప్పింగ్, పుట్‌బాల్ ఆటల్లో శిక్షణ ఇచ్చాడు. తాజాగా ప్యూరిన్ ప్రదర్శించిన స్కిప్పింగ్ ఫీట్‌లో నిమిషానికి 58 జంప్‌లు చేసి గతంలో తనే నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. అప్పట్లో ప్యూరిన్ నిమిషానికి 51 జంప్‌లు చేసి గిన్నిస్‌కు ఎక్కింది. తాజాగా 58 జంప్‌లతో మరోమారు రికార్డు నెలకొల్పింది. కాగా 2015లో ఫుట్‌బాల్ పోటీలో బంతిని నిలువరించడంలోనూ ప్యూరిన్ గిన్నిస్‌కెక్కింది.