: క్యాబేజీ లోడులో గంజాయి అక్రమ రవాణా.. విజయవాడలో రూ.1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!
గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. క్యాబేజీ లోడులో గంజాయిని పెట్టి పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులకు చిక్కారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద వాహనంలో తరలిస్తున్న రూ.1.30 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు వాహనంలో తరలుతున్న గంజాయిని పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.