: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిని నేనే!: ములాయం సింగ్
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిని తానేనని, తాను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలని ములాయం సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన కుమారుడు అఖిలేష్ యాదవ్ యూపీకి మాత్రమే ముఖ్యమంత్రి అని, సోదరుడు శివపాల్ యాదవ్ యూపీ పార్టీ చీఫ్ గా కొనసాగుతారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ పై మరోసారి వేటు వేశారు. పార్టీ నుంచి మరో ఆరేళ్ల పాటు రాంగోపాల్ యాదవ్ ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రోజు ఉదయం తమ పార్టీలో ఎలాంటి వివాదం లేదని చెప్పిన ములాయం తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.