: అభిమానులారా! బాలయ్య బాబుకు వినపడాలి: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
‘అభిమానులారా! ఆగండి.. నేను మాట్లాడేది బాలయ్య బాబుకు వినపడాలి’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్టణంలోని జ్యోతి థియేటర్ లో ‘శాతకర్ణి’ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే, బాలయ్య అభిమానుల చప్పట్లు, నినాదాలు, ఈలలు మార్మోగడంతో విష్ణుకుమార్ రాజు పైవిధంగా వ్యాఖ్యానించారు. తమ అభిమాన నటుడు ఎప్పుడు మాట్లాడతాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులు ‘బాలయ్య..బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు.