: కేవీపీ! తెలుగుజాతి గొంతు కోసిన ‘కాంగ్రెస్’లో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా?: చీఫ్ విప్ కాల్వ


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావుపై చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. తెలుగుజాతి గొంతుకోసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి కేవీపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

కాగా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఉండేందుకు నాడు కోర్టులకు వెళ్లింది చంద్రబాబు, ఆయన పార్టీ నేతలేనని కేవీపీ ఇటీవల విమర్శించారు. అంతేకాకుండా, పోలవరం తాను కన్నకల అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని, ‘పోలవరం’పై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబుకు కేవీపీ ఇటీవల సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News