: ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్: స్పష్టం చేసిన జైట్లీ


కేంద్ర బడ్జెట్ వివాదంపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ తేదీని మూడు నెలల క్రితమే ఖరారు చేశామని, బడ్జెట్ ను వాయిదా వేసే సంప్రదాయం ఎప్పుడూ లేదని ఈ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. కాగా, సాధారణ బడ్జెట్ సమర్పించే సమయంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ఏడాది ముందుగానే బడ్జెట్ ప్రవేశపెడతారనే వార్తలు హల్ చల్ చేశాయి. అరుణ్ జైట్లీ ప్రకటనతో ఈ వార్తలకు తెరపడినట్లయింది. 

  • Loading...

More Telugu News