: నదుల అనుసంధానం ప్రకృతి విరుద్ధం!: 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' రాజేంద్రసింగ్
ఏపీలో వాటర్ మేనేజ్ మెంట్ సరిగా లేదని 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' రాజేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నదుల అనుసంధానం ప్రకృతి విరుద్ధమని, నదుల అనుసంధానం అంటే కాలుష్యాన్ని, అవినీతిని కలపడమేనని అన్నారు. రాజస్థాన్ కన్నా ఏపీలో ఐదు రెట్ల నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ తరచుగా కరవు వస్తోందన్నారు.