: కంటికి గ్లాసు అడ్డంగా పెట్టుకుని తన ఫొటో పోస్ట్ చేసిన వర్మ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా సినీ నటుడు నాగబాబు దర్శకుడు వర్మపై వ్యాఖ్యలు చేయడం, అందుకు ఆయన తన దైన శైలిలో స్పందించడం తెలిసిందే. ఈ క్రమంలో ‘మెగాస్టార్’ అభిమానులు స్పందిస్తూ.. వర్మ ఫొటోను పెట్టి దానికి ‘ రౌడీ నంబర్ 150’ అనే టైటిల్ పెట్టి పోస్ట్ చేయడం విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ స్పందించిన వర్మ, స్టీల్ గ్లాస్ ను తన కంటికి అడ్డంగా పెట్టుకుని దిగిన ఒక ఫొటోకు ‘రౌడీ నంబర్ 150’ అనే టైటిల్ నే పెట్టి పోస్ట్ చేశారు.