: పారిశుద్ధ్యం సరిగా లేదంటూ అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం


పారిశుద్ధ్యం సరిగా లేదంటూ అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని రంగనాయకుల స్వామి ఆలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడాన్ని గుర్తించిన ఆయన, సంబంధిత అధికారులపై మండిపడ్డారు. తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని నెల్లూరు మేయర్ ను ఆదేశించారు. కాగా, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. 

  • Loading...

More Telugu News