: ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నేర్పించాలి: షారూక్ ఖాన్
బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన సంఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ స్పందించారు. మహిళలను ఏ విధంగా గౌరవించాలనే విషయాన్ని తల్లిదండ్రులు తమ కొడుకులకు నేర్పించాలని ఆయన సూచించారు. సెలెబ్రిటీలు అయినా, సాధారణ ప్రజలు అయినా ముందుగా మనమందరం తల్లిదండ్రులమని, మహిళలను గౌరవించడం గురించి మగపిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలని, వారు సరైన మార్గంలో నడిచేలా పెంచాలని కోరారు. తన తల్లి, కూతురు, ఇతర అమ్మాయిలందరూ తన హృదయానికి దగ్గరగా ఉన్నారని, తన దృష్టిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఈ విశ్వంలో వీరందరూ చాలా గౌరవమైన వారని మనం గ్రహించాలని షారూక్ అన్నారు.