: మంగళవారం మార్కెట్లో బంగారం ధరలు
మంగళ వారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.28,200 పలికితే, విజయవాడలో రూ.27,900 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.28,100గా రాజమండ్రిలో రూ.27,750గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.27,700 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర హైదరాబాదులో రూ.27,900, విజయవాడలో రూ.26,000 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.27,840గా ఉంది. రాజమండ్రిలో రూ. 25,435 పలకగా, విశాఖపట్నంలో 25,690తో ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.48,500 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.46,700 పలికింది.