: చేనేత వస్త్రాల్లో నాగార్జున, అమల ఫొటో!


చేనేతకు చేయూత నిచ్చేందుకు అందరూ ముందుకురావాలని, ముఖ్యంగా సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చిన సంగతి విదితమే. ఆ పిలుపు మేరకు ప్రముఖ నటుడు నాగార్జున స్పందించారు. ‘నేను, అమల చేనేత వస్త్రాలు ధరించిన ఫొటో ఇదీ’ అంటూ నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫొటోను పోస్ట్ చేశారు. చేనేత వస్త్రాలు అందంగా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా కూడా ఉన్నాయని ఆ ట్వీట్ లో కేటీఆర్ కు తెలిపారు. ఈ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. ‘థ్యాంక్స్ నాగ్. ఇది చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా’ నని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News