: అత్యుత్తమ ప్రదర్శన ఇదేనని చెప్పడం అబద్ధమే అవుతుంది!: అశ్విన్


కెరీర్ లో పీక్ దశలో ఉండి, అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను క్రీడాభిమానులు పొగడుతూ ఉంటే, అశ్విన్ మాత్రం తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంకా నమోదు కాలేదని అన్నాడు. ప్రస్తుతానికి అత్యుత్తమ ప్రదర్శన ఇదేనని చెప్పడం అబద్ధమే అవుతుందని, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నది ఎప్పటికీ తెలుసుకోలేమని అన్నాడు. ఆటతీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ సాగడమే తన ఉద్దేశమని చెప్పాడు. 2015లో తన ప్రదర్శన పేలవంగా ఉన్న వేళ, తల్లి తనకు హితబోధ చేసిందని, పోరాటం నుంచి పారిపోకూడదని తాను నేర్చుకున్నానని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News