: కేసీఆర్ కు నా థ్యాంక్స్: సింహాచలంలో బాలకృష్ణ
తెలంగాణ రాష్ట్రంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాలకృష్ణ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉదయం సింహాచలం వచ్చి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించామని చెప్పిన ఆయన, వాస్తవానికి శాతకర్ణి చిత్రాన్ని తన తండ్రి చేయాల్సిందని, తన అదృష్టం కొద్దీ ఈ అవకాశం తనకు లభించిందని వెల్లడించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడంతోనే అప్పట్లో సినిమా చేయలేకపోయారని తెలిపారు. ఇటువంటి చారిత్రక చిత్రానికి టీఎస్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు.