: ఇక సొంత పార్టీయే...! మనసులో మాట చెప్పిన జయలలిత మేనకోడలు!


తన రాజకీయ ప్రవేశంపై దివంగత తమిళనాడు సీఎం జయలలిత మేనకోడలు దీపాకుమార్ మరింత స్పష్టత ఇచ్చారు. త్వరలోనే సొంత పార్టీని పెట్టనున్నానని, అన్నాడీఎంకే కార్యకర్తలు తనకు అండగా ఉంటారని భావిస్తున్నానని అన్నారు. తన ఇంటివద్దకు వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి దీప మాట్లాడుతూ, క్యాడర్ శాంతంగా ఉండాలని, వేచి చూడాలని కోరారు. 17వ తేదీన అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేద్దామని పిలుపునిచ్చారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించామని, ఈ మేరకు అతి త్వరలోనే ప్రకటన చేయనున్నామని పేర్కొన్నారు. కాగా, నిత్యమూ వేలాది మంది దీప ఇంటికి వచ్చి, ఆమెకు మద్దతు తెలుపుతూ, ఆమె రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News