: నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ వేకువ జామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రజలు భయంతో వణికిపోయారు. దుత్తలూరు, వింజమూరు సహా పలు గ్రామాల్లో భూకంపం సంభవించినట్టు ప్రజలు తెలిపారు. నిద్రలో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఉన్నపళంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవల తరచూ ఈ జిల్లాలో భూమి కంపిస్తున్న సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎటువంటి నష్టం చోటుచేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.