: తిరుమలలో భక్తుల మధ్య తోపులాట... నియంత్రించలేక సిబ్బంది అవస్థలు!


ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు తాత్కాలిక షెడ్లు, మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోగా, క్యూలైన్ల లోకి భక్తులను అనుమతించడాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో మేదరమిట్ట వద్ద భక్తజన సందోహం పెరిగిపోయి తోపులాట జరిగింది. భక్తులను నియంత్రించలేక టీటీడీ సిబ్బంది అవస్థలు పడుతోంది. మాడ వీధుల గేట్లను మూసివేయడంతో, వాటిని తెరవాలని భక్తులు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వేచివున్న భక్తులకు దర్శనం పూర్తయితేనే తప్ప, ఇప్పుడు బయటున్న వారిని కంపార్టుమెంట్ల లోపలకు పంపలేమని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News