: ముద్రగడ కాపు ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలి!: సినీ నటి హేమ పిలుపు
కాపుల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సినీ నటి హేమ పిలుపునిచ్చారు. శనివారం సింహాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఆమె మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. హామీ అమలులో ఆయన విఫలమయ్యారని పేర్కొన్నారు. ముద్రగడ ఆశయ సాధన కోసం తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానని తెలిపారు. కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సులో పాల్గొని అక్కడి నుంచి సింహాచలం వచ్చినట్టు హేమ వివరించారు. తాను ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 425కు పైగా సినిమాల్లో నటించానని పేర్కొన్నారు.