: అంతా ఫూల్స్, స్టుపిడ్స్ అంటూ డొనాల్డ్ ట్రంప్ తిట్ల పురాణం!


గత సంవత్సరం నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ను ఓడించి డొనాల్డ్ ట్రంప్ గెలిచేందుకు రష్యా సహకరించిందని యూఎస్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన నివేదిక, దేశవ్యాప్తంగా కలకలం రేపగా, తనను విమర్శిస్తున్న వారిపై తిట్ల పురాణాన్ని అందుకున్నారు ట్రంప్. ఈ నివేదిక 25వ పేజీలో ట్రంప్ గెలుపునకు సాయపడాలని పుతిన్ ఆదేశించినట్టు ఉన్న సంగతి తెలిసిందే. రష్యాతో సత్సంబంధాలు ఉండాలని తాను కోరుకుంటున్నానని, కేవలం ఫూల్స్, స్టుపిడ్స్ మాత్రమే దాన్ని తప్పంటున్నారని అన్నారు. ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తున్న వారంతా వెర్రి వాళ్లేనని, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, అమెరికాకు రష్యా మరింతగా గౌరవం ఇస్తుందని, అది ఇప్పటికంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. రెండు దేశాల మధ్యా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పుతిన్ తో కలసి పని చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News