: రష్యా చర్చిలో ఓం నమఃశివాయ, గం గణపతయే నమః!
రష్యాలోని ఓ క్రైస్తవాలయంలో హిందువుల భక్తి గీతాలను ఆలపిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చుట్టూ సంగీత బృందం వాద్య సహకారాన్ని అందిస్తుంటే, ఓ గాయని, ఓం నమః శివాయ’, ‘ఓం గం గణపతయే నమః అంటూ, మంత్రాలను లయబద్ధంగా పాడుతోంది. చుట్టూ ఉన్న వాళ్లంతా కోరస్ పాడుతూ, చప్పట్లు కొడుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ఇది ఇండియా గర్వపడాల్సిన విషయమని అంటున్నారు. హిందువుల భక్తి గీతాలను విదేశీయులు పాడుకోవడమే గొప్పయితే, అది ఏకంగా ఓ చర్చిలో పాడటం మరింత విశేషమే మరి!