: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన కేంద్ర, ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు
తిరుమల శ్రీవారి దర్శనానికి అమాత్యులు పోటెత్తారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, మృణాళిని, శిద్దా రాఘవరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి తదితరులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే చాముండేశ్వరినాథ్, మోహన్‌బాబు, నిమ్మగడ్డ ప్రసాద్, గాలి జనార్దన్‌రెడ్డి తదితర ప్రముఖులు శ్రీవారి సేవలో తరించారు.