: నాగబాబు ఆవేశంలో అలా అని ఉంటాడు...ఎందుకలా అన్నాడో తెలియదు!: యండమూరి


హాయ్ లాండ్ లో నిర్వహించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యండమూరి వీరేంద్రనాథ్ ను కుసంస్కారి అని, వ్యక్తిత్వ వికాసం బోదించడం కాదు, ముందు నేర్చుకోవాలంటూ తీవ్ర పదజాలంతో నాగబాబు మాట్లాడిన మాటలపై ఆయన యండమూరి స్పందించారు. నాగబాబు ఇలా ఎందుకు మాట్లాడాడో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. నాగబాబు ఆవేశంలో అలా మాట్లాడి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మధ్య ఒక ఫంక్షన్లో తామిద్దరం కలుసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. 'గురువుగారూ' అంటూ ఆప్యాయంగా పలకరించి, ఒక కథ చెప్పమని కోరాడని ఆయన చెప్పారు. భవిష్యత్తులో తామిద్దరం కలిసి ఓ సినిమా చేయచ్చని యండమూరి తెలిపారు. 

  • Loading...

More Telugu News