: పదేళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను!: అల్లు అర్జున్


పదేళ్లుగా ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. హాయ్ లాండ్ లో జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, అన్నయ్య మళ్లీ రావాలి, నటించాలి, వేలెత్తిని చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడాలని ఎంతో ఆశించానని, తన ఆశ ఇన్నాళ్టికి నెరవేరిందని అన్నాడు. సినిమా విడుదలైన తరువాత వేలెత్తిచూపిన చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడతాయని చెప్పాడు.

తాను ఎలాంటి సంగీతమైతే చిరంజీవి గారికి ఉండాలని కోరుకుంటానో అలాంటి సంగీతాన్నే తన మిత్రుడు దేవీ శ్రీప్రసాద్ ఇచ్చాడని అన్నాడు. చిరంజీవిగారు మళ్లీ నటిస్తే ఆ సినిమాకి దర్శకుడుగా వినాయక్ ఉండాలని చాలాసార్లు అనుకున్నానని, తాను ఊహించినట్టే ఆయనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారని అల్లు అర్జున్ తెలిపాడు. సినిమా అద్భుతంగా ఉంటుందని, తాను కూడా ట్రైలర్ ఇప్పుడే చూశానని, సినిమా చూడాలని ఉత్సాహంగా ఉందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News