: తోటి అభిమానులకు 'మెగా' అభిమానుల సపర్యలు


గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్ ల్యాండ్ లో జరుగుతున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి తోడు మెగా స్టార్లంతా ఈ ఈవెంట్ కి వస్తున్నారన్న ప్రకటన వారిలో మరింత ఊపుతెచ్చింది. ఈ క్రమంలో హాయ్ ల్యాండ్ కిక్కిరిసిపోయింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలువురు అభిమానులు రద్దీని తట్టుకోలేక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలాంటి వారికి మెగా అభిమానులు సపర్యలు చేసి ఆకట్టుకున్నారు. అవసరమైన వారికి నీటిని సరఫరా చేసి దాహాన్ని తీరుస్తున్నారు.  

  • Loading...

More Telugu News