: 96 సెంటీమీటర్లు ఉన్న బాలుడి తల... అరుదైన శస్త్రచికిత్స చేసి తగ్గించిన డాక్టర్లు
హైడ్రోసెఫలాస్ వ్యాధితో బాధపడుతూ తల ఉబ్బిపోయిన ఓ ఏడు నెలల చిన్నారికి భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. 96 సెంటీమీటర్లు ఉన్న ఆ చిన్నారి తలను ప్రస్తుతం 70 సెం.మీ.ల వరకు తీసుకువచ్చారు. శస్త్రచికిత్స తరువాత ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. ఆ బాలుడి పుర్రె చుట్టూ సుమారు 5.5 లీటర్ల ద్రవం చేరిందని, అందులో దాదాపు 4 లీటర్ల ద్రవాన్ని తీసేశామని చెప్పారు. ఇందుకోసం ఆరు వారాల పాటు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ బాలుడికి ఇంకా శస్త్రచికిత్స జరగాల్సి ఉందని చెప్పారు.