: వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు ప్లాన్ వేశారు: వైసీపీ


అమరావతిలోని భూములను స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి... వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ వేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి అన్యాయమైనదని ఇప్పటికే కేల్కర్ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ విధానంపై హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని విమర్శించారు. అయినప్పటికీ, చిన్నచిన్న సవరణలు చేసి, మళ్లీ స్విస్ విధానంలోనే భూములను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో దోచుకోవడానికి వైసీపీ వ్యతిరేకమని తెలిపారు.

  • Loading...

More Telugu News