: మెగా అభిమానులతో సందడిగా మారిన హాయ్ ల్యాండ్


ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సుదీర్ఘ విరామం తరువాత వెండితెరకు పునరాగమనం చేస్తూ రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున గుంటూరు జిల్లా చినకాకానిలో గల హాయ్ ల్యాండ్ కు పోటెత్తారు. దీంతో హాయ్ ల్యాండ్ పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా ఫంక్షన్ ప్రారంభమయ్యేందుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా హాయ్ ల్యాండ్ కు చేరుకుంటున్నారు. దీంతో వారిని చూసేందుకు మెగా అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు రక్షణగా భారీ ఎత్తున బౌన్సర్లను చిత్రయూనిట్ రంగంలోకి దించింది. 

  • Loading...

More Telugu News