: ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రయాణం ప్రారంభించిన మెగా'స్టార్స్'!
టాలీవుడ్ మెగా'స్టార్స్' అంతా చినకాకాని బయల్దేరారు. హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్న మెగా ఫ్యామిలీ 'స్టార్స్' అంతా గుంటూరులోని చినకాకానిలో ఉన్న హాయ్ ల్యాండ్ కు బయల్దేరారు. అంతకు ముందు గన్నవరంలో చిరంజీవికి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం వద్దకు మెగా అభిమానులు భారీ ఎత్తున చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. సాదర స్వాగతం అందుకున్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్న హాయ్ ల్యాండ్ కు పయనమయ్యారు. ఆయన వెంట ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఇతర మెగా'స్టార్స్' ఉన్నారు.