: రూ.54 తగ్గిన సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్
పెట్రోల్ లీటర్ ధరను 3 రూపాయలు తగ్గించిన ప్రభుత్వం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. 14. 2 కేజీల సిలిండర్ పై 54 రూపాయలు తగ్గించింది. దీంతో సిలిండర్ ధర 847 రూపాయలకు దిగొచ్చింది. ప్రభుత్వం ఏటా 9 సబ్సిడీ సిలిండర్లను మాత్రమే అందిస్తోంది. ఆ కోటా దాటిన తర్వాత తీసుకునే సిలిండర్లకు ఈ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ధర తగ్గడంతో పెట్రోలియం సంస్థలు ఆ మేరకు వినియోగదారులకు ఊరట కల్పించాయి.