: బాలయ్య ఎక్కువగా వింటున్న చిరంజీవి పాట!
టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న నేపథ్యంలో వారి అభిమానుల సందడి ఎక్కువైంది. కానీ, వీరిద్దరు మాత్రం తమ మధ్య ఎలాంటి పోటీ లేదని... ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్లు కావాలనే ధోరణిలో ఉన్నారు. బాలయ్య సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక బాలయ్య విషయానికి వస్తే... ఆయన తన కారులో 'ఖైదీ నంబర్ 150' సినిమా పాటలను వింటున్నారట. ముఖ్యంగా 'నీరు నీరు నీరు' అనే పాటను ప్రత్యేకంగా వింటున్నారట. అభిమానులు కూడా వీరిద్దరినీ ఫాలో అయితే... ఏ సమస్యా ఉండదు.