: చంద్రబాబు బహుమతిపై హరిత విప్లవ పితామహుడి ప్రశంస!
నోబెల్ బహుమతిని సాధించే ఆంధ్రుడికి రూ. 100 కోట్లు బహుమానంగా ఇస్తామంటూ తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బహుమతిపై హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు ప్రకటన యువతరానికి, ఇప్పటికే పరిశోధనల్లో తలమునకలైన శాస్త్రవేత్తలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించే వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు భారీ మొత్తంలో డబ్బు ఇస్తుంటాయని... అలాంటప్పుడు నోబెల్ విజేతకు భారీ బహుమానం ప్రకటించడం తప్పేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నోబెల్ సాధించిన శాస్త్రవేత్తకు బహుమానం ప్రకటించడం చాలా మంచి నిర్ణయమని... ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని చెప్పారు.