: పాఠశాలలోకి వచ్చిన కొండచిలువ.. భయాందోళనలకు గురైన విద్యార్థులు
పాఠశాలలోకి కొండచిలువ వచ్చి విద్యార్థులను భయాందోళనలకు గురి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. పాఠశాలలో కొండ చిలువను గుర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే తరగతి గదుల నుంచి బయటకు పంపించి, అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. కొండ చిలువ ఏదో జంతువును తిందని, దీంతో అది కదల్లేని స్థితిలో ఉందని చెప్పారు.