: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి యువకుడి అఘాయిత్యం
తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రిపూట ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన తమ కూతురుని ఆమె తల్లిదండ్రులు ఏమయిందని అడగగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలుపుతూ.. జిల్లాలోని రాజవమ్మంగి శివారు కన్నయ్యమ్మపేటకు చెందిన లోవరాజ అనే 21 ఏళ్ల యువకుడు తన ఇంటి సమీపంలోని 12 ఏళ్ల ఓ బాలికను నిన్న రాత్రి సెకండ్ షో సినిమాకంటూ తీసుకెళ్లాడని చెప్పారు.
అయితే, సగం సినిమా అయిపోయాక, ఇంట్లో పని ఉంది అని త్వరగా వెళ్లాలని బాలికతో మాయమాటలు చెప్పి, థియేటర్నుంచి ఇంటికి వస్తూ ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో తీవ్ర భయానికి గురయిన ఆ బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిందని చెప్పారు. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేశామని చెప్పారు. ఆ యువకుడికి వివాహం అయినట్లు తెలుస్తోంది.