: పాక్‌లో ‘ఇండియా’పై సర్వే: ఊహించని ఫలితాలు


భారత్ తో సంబంధాల విషయంలో పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయం ఓ సర్వేలో తేటతెల్లమైంది. భారత్ లో ఉరీ ఉగ్రదాడి, పీఓకేలో భారత బలగాల సర్జికల్ స్ట్రయిక్స్ ఘటనలు జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో భారత్ పాక్ సంబంధాలపై ప్రఖ్యాత గాలప్ సర్వే సంస్థ పాకిస్థాన్ లో ఉన్న తన శాఖ ద్వారా సర్వే నిర్వహించింది. పాకిస్థాన్ లోని సింధ్, పంజాబ్, బలూచ్, ఖైబర్ ఫక్తూన్ క్వా రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో సుమారు 2000 మందిని ఒకే ప్రశ్న అడిగారు. 'భారత్ తో చర్చలకు మీరు అనుకూలమేనా?' అనేదే ఈ ప్రశ్న.

ఈ ప్రశ్నకు 68 శాతం మంది 'చర్చలు జరగాలి' అంటూ సమాధానమిచ్చారు. 31 శాతం మంది 'వద్దు' అని చెప్పారు. కేవలం ఒక్క శాతం మాత్రం 'తెలియదు' అని సమాధానమిచ్చారు. చర్చల ద్వారా ఇరు దేశాల్లో శాంతి నెలకొంటుందని... ఇరు దేశాలు స్నేహపూర్వకంగా ఉంటే, దక్షిణాసియాలో తిరుగే ఉండదని మెజారిటీ పాకిస్థానీలు అభిప్రాయపడ్డారు. ఈ సర్వే ఫలితాలను కొన్ని గంటల ముందు గాలప్ సంస్థ విడుదల చేసింది. సర్వే ఫలితాలతో పాక్ లోని పలువురు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఈ ఫలితాలు మింగుడుపడటం లేదు.

  • Loading...

More Telugu News