: బాపట్ల బీచ్ లో టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం.. హరిత రిసార్ట్స్ సిబ్బందిపై దాడి!
ఏపీలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బాపట్ల బీచ్ లో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ వీరంగం సృష్టించారు. సూర్యలంక బీచ్ లో హరిత రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ పై దాడి చేశారు. రూమ్ లోకి లాక్కెళ్లి చితకబాదారు. మరో నలుగురు సిబ్బందిపై కూడా దాడికి తెగబడ్డారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, సినీ నిర్మాత కొరటాల సందీప్ పుట్టిన రోజు వేడుక హరిత రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడుకకు సతీష్ కూడా హాజరయ్యారు. వేడుకకు వచ్చిన అతిథులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ లో వేసిన క్యాంప్ ఫైర్ కు ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ అక్కడి సిబ్బందిపై సతీష్ దాడి చేశారు. సిబ్బందిని చితకబాదారు.