: నేపాల్‌కు రూ.100 కోట్ల విలువైన వందనోట్ల పంపిణీకి ఆర్బీఐ అంగీకారం.. ప్రజల కష్టాలు తీర్చేందుకే..
భారత్‌లో పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న పొరుగుదేశం నేపాల్‌కు వంద కోట్ల రూపాయల విలువైన రూ.100 నోట్లను పంపించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ముందుకొచ్చింది. ఇక్కడ భారత కరెన్సీ విరివిగా చలామణిలో ఉండడంతో నోట్ల రద్దు ప్రభావం వారిపైనా పడింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. వారి అవస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి భారీ మొత్తంలో డబ్బులు పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది. భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత తమ దేశంలోని భారత కరెన్సీని చలామణి చేసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ గత కొంతకాలంగా నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారత్‌ను కోరుతోంది. దీంతో స్పందించిన ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి మాసాంతానికి రూ.100 కోట్ల విలువైన రూ.100 నోట్లను పంపించాలని నిర్ణయించింది.