: తెలంగాణ అసెంబ్లీలో 'చీరకొట్టు.. మైక్ పట్టు స్కీం' పెట్టాలంటూ డిప్యూటీ స్పీకర్‌తో చమత్కరించిన ఎంపీ కవిత!
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం సరదా సంభాషణ చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీకి వచ్చారు. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన పద్మాదేవేందర్‌రెడ్డి తన బర్త్ డే రోజు పురుషులు ఎవరూ తనకు బహుమతులు ఇవ్వలేదని, తన ఆడబిడ్డ కవిత వచ్చి చీర ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి కవిత నవ్వుతూ మీరు సభలో ఉన్నప్పుడు చీరకొట్టు.. మైక్ పట్టు అనే స్కీం పెడితే అప్పుడు చీరలు కుప్పలు తెప్పలుగా వస్తాయని చమత్కరించారు. కవిత వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ, ఈ విషయాన్ని నేరుగా సభలో చెబితే బాగుండదని, తనకు అర్థమయ్యేలా సైగలతో చెబితే చాలని అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.